తొలి కిరణం | అక్టోబర్ 11 | ఘట్కేసర్ ప్రతినిధి
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం ఎదులాబాద్ కచ్చిరిబస్తీలో జై దుర్గా భవాని యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ దుర్గా భవాని నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో మొదటి రోజు అమ్మవారు బాల త్రిపుర సుందరి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. రంగురంగుల విద్యుత్ దీపాల వెలుగుల్లో అమ్మవారి అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఆలయ ప్రాంగణం భక్తి భావంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
వివిధ అవతారాల్లో అమ్మవారి దర్శనం
నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం గాయత్రీ దేవిగా, మంగళవారం అన్నపూర్ణాదేవిగా, బుధవారం మహాచండీ దేవిగా, గురువారం లలితా త్రిపుర సుందరీ దేవిగా, శుక్రవారం సరస్వతీ దేవిగా, శనివారం మహాలక్ష్మీ దేవిగా, ఆదివారం దుర్గాదేవిగా, సోమవారం మహిషాసురమర్దిని దేవిగా, మంగళవారం రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ప్రతిరోజూ అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు జై దుర్గా భవాని యూత్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. నవరాత్రి ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని వారు కోరారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


