తొలి కిరణం న్యూస్ | నారాయణపేట, అక్టోబర్ 10:
నారాయణపేట మండలం కోటకొండ గ్రామంలోని చైతన్య పాఠశాలలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ విషయాన్ని పాఠశాల ప్రిన్సిపల్ ప్రభాకర్ తెలిపారు. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు బంతి, గునుగు, తంగేడు తదితర రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి గ్రామంలోని భగత్‌సింగ్ కూడలిలో ఆటపాటలతో సంబరాలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా చిన్నారి విద్యార్థులు ప్రదర్శించిన “ఆడపిల్లను పుట్టనిద్దాం.. చదవనిద్దాం.. బ్రతకనిద్దాం.. ఎదగనిద్దాం” అనే సందేశంతో కూడిన ప్లకార్డు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆడపిల్లల హక్కులు, విద్య, భద్రత, సమాన అవకాశాల ప్రాముఖ్యతను చాటిచెప్పిన ఈ ప్రదర్శన అందరినీ ఆలోచింపజేసింది.
అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులు ర్యాలీగా బయలుదేరి గ్రామంలోని పెద్ద చెరువులో బతుకమ్మను సాగనంపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ప్రభాకర్, ఉపాధ్యాయులు నవ్యశ్రీ, లక్ష్మీకుమారి, సమీన, సరళ, పూజ, చంద్రకళ, రాజు, భవాని, మౌనిక, జయ, స్పందన, అమీరాతో పాటు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


