పాలెం, తొలి కిరణం న్యూస్: నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం పాలెం గ్రామంలోని శ్రీ అలమేలుమంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం పల్లకి సేవ నిర్వహించారు. ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో సేవాపరులు, భక్తుల సహకారంతో స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి పల్లకి సేవను భక్తిశ్రద్ధలతో జరిపించారు. స్వామివారి పల్లకి సేవలో భక్తులు పాల్గొని స్వామివారి కృపాకటాక్షాలు పొందారు. ఆలయ ప్రాంగణం భక్తులతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


