ఘట్కేసర్ (తొలి కిరణం): పోచారం ఐటీసీ పోలీస్‌స్టేషన్ పరిధిలో శివరామకృష్ణ (55) అనే వ్యక్తి అదృశ్యమయ్యారు. పోలీసుల వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన శివరామకృష్ణ కుటుంబ సభ్యులతో కలిసి అక్టోబర్ 3న పోచారం గ్రామంలోని గెలాక్సీ టవర్స్‌కు వచ్చారు. అక్టోబర్ 4న విజయవాడలోని బ్యాంకులో పని ఉందని చెప్పడంతో సాయంత్రం 6.30 గంటల సమయంలో అన్నోజిగూడ ఫ్లైఓవర్ కింద ఉన్న బస్టాప్ వద్ద దింపి వెళ్లారు. అక్టోబర్ 5న ఆయనకు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ రావడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. బంధువులు, స్నేహితుల వద్ద విచారించినా ఆచూకీ లభించకపోవడంతో అక్టోబర్ 8న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోచారం ఐటీసీ పోలీసులు క్రైం నంబర్ 558/2026 కింద మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అదృశ్యమైన వ్యక్తి వివరాలు: శివరామకృష్ణ, వయస్సు 55 సంవత్సరాలు, ఎత్తు సుమారు 5.6 అడుగులు. అదృశ్యమైన సమయంలో తెల్ల చొక్కా, నల్ల చారలతో కూడిన దుస్తులు, నీలం రంగు జీన్స్ ధరించి ఉన్నారు. ఆయనకు తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషలు మాట్లాడటం వచ్చు. ఆయన ఆచూకీ తెలిసిన వారు పోచారం ఐటీసీ పోలీసులను సంప్రదించాలని పోలీసులు కోరారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


