అక్టోబర్ 8: బిజినపల్లి మండలం లట్టుపల్లి గ్రామానికి చెందిన యువ నాయకుడు, బీజేపీ క్రియాశీల కార్యకర్త పెద్ద బుద్ధి ప్రవీణ్ సాగర్ను భారతీయ జనతా పార్టీ యువమోర్చా నాగర్కర్నూల్ జిల్లా కార్యదర్శిగా నియమించారు. పార్టీ యువతను సమాయత్తం చేస్తూ, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న ఆయన సేవలను గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు.
పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ, ప్రజా సమస్యలపై స్పందిస్తూ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని ప్రవీణ్ సాగర్ తెలిపారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన జిల్లా, మండల పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా యువతను భాగస్వాములను చేస్తూ, పార్టీని గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.
ప్రవీణ్ సాగర్ నియామకంపై బీజేవైఎం నాయకులు, లట్టుపల్లి గ్రామ పార్టీ శ్రేణులు, యువకులు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


