నాగర్కర్నూల్, తొలి కిరణం: రాష్ట్రంలో విద్యుత్ కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీజేపీ ఓబీసీ మోర్చా నాగర్కర్నూల్ జిల్లా ఉపాధ్యక్షుడు ఈర్లపల్లి శ్రీనివాస్ ముదిరాజ్ విమర్శించారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రస్తుతం ఐదు నుంచి ఆరు గంటలు కూడా సక్రమంగా విద్యుత్ సరఫరా చేయలేకపోతోందని ఆరోపించారు.
వ్యవసాయానికి విద్యుత్ అత్యవసరమైన సమయంలో కోతలు విధించడంతో రైతులు పంటలకు నీరు అందించలేక ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ఇప్పటికే సాగు ఖర్చులు పెరిగి ఇబ్బందులు పడుతున్న రైతులపై విద్యుత్ కోతలు మరింత భారాన్ని మోపుతున్నాయని పేర్కొన్నారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని శ్రీనివాస్ ముదిరాజ్ విమర్శించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వ్యవసాయానికి అవసరమైన సమయంలో నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
రైతుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో రైతుల పక్షాన ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. రైతుల సమస్యలను పరిష్కరించే వరకు వారికి అండగా ఉంటామని స్పష్టం చేశారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


