కుత్బుల్లాపూర్: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం డివిజన్ పరిధిలోని టీఎస్ఐఐసీ కాలనీలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు అవగాహన, ఎన్రోల్మెంట్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మాజీ కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పుప్పాల భాస్కర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీఆర్ఎస్ పార్టీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద హాజరయ్యారు. ఈ సందర్భంగా అర్హులైన పట్టభద్రులు తప్పనిసరిగా ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో పట్టభద్రుల ఓటు హక్కు ఎంతో కీలకమని అన్నారు. అర్హత కలిగిన ప్రతి గ్రాడ్యుయేట్ ఫారం–18 ద్వారా తమ పేరును ఎమ్మెల్సీ ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి పట్టభద్రుడికి ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు.
కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సిద్ధిక్, మహిళా అధ్యక్షురాలు హేమలతా రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, బసిరుద్దీన్, ఫిరోజ్, చెక్క సురేష్, దొడ్ల శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, సురేష్, చంద్రశేఖర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, సాయిబాబా, రోషన్, లావణ్య, షైనాజ్ బేగం తదితర నాయకులు, కార్యకర్తలు, పట్టభద్రులు, కాలనీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


