చిన్నముద్దునూరు, అక్టోబర్ 7: చిన్నముద్దునూరులో పీఏసీఎస్/ఎఫ్‌పీఓ తెలకపల్లి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “ప్యూర్ కోల్డ్ ప్రెస్ ఆయిల్స్” యూనిట్‌ను నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పటేల్, ఐఏఎస్ బుధవారం ఆకస్మికంగా సందర్శించారు.
ఈ సందర్భంగా డీసీఓ రఘునాథరావు, పీఏసీఎస్/ఎఫ్‌పీఓ తెలకపల్లి చైర్మన్ డి. భాస్కర్‌రెడ్డితో కలిసి యూనిట్లో జరుగుతున్న కోల్డ్ ప్రెస్ ఆయిల్ తయారీ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. ముడి సరుకు నాణ్యత, తయారీ విధానం, శుద్ధీకరణ, ప్యాకేజింగ్, మార్కెటింగ్ ప్రక్రియలపై సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
రైతుల నుంచి సేకరించిన నాణ్యమైన నూనె గింజలను స్థానికంగానే ప్రాసెస్ చేసి విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్కెట్ చేయడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం కల్పించే అవకాశాలపై కలెక్టర్ పరిశీలించారు. ప్రస్తుతం యూనిట్లో పల్లీ, కుసుమ తదితర కోల్డ్ ప్రెస్ నూనెలను తయారు చేసి మార్కెట్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
భవిష్యత్తులో మరిన్ని రకాల నూనెల ఉత్పత్తిని విస్తరించి, రైతులకు మరింత ప్రయోజనం చేకూర్చేలా చర్యలు చేపడుతున్నట్లు అధికారులు వివరించారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


