కట్టంగూరు: కట్టంగూరు మండల కేంద్రానికి చెందిన ప్రముఖ హైకోర్టు న్యాయవాది, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చత్రపతి గారి మాజీ ఎంపీటీసీ సతీమణి శేరి అనురాధ అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె పార్థివ దేహానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ సుంకర బోయిన నరసింహ యాదవ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు తండు అంజయ్య గౌడ్, మేడి ఈద్దయ్య, శంకర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ కార్యదర్శి మాద లింగస్వామి, కట్టంగూరు కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షుడు చెరుకు యాదగిరి, బొల్లెపల్లి సర్పంచ్ వల్లపు రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు నర్సింగ్ దుర్గయ్య, బొల్లెపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకుడు రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ సత్తయ్య తదితరులు పాల్గొని అనురాధకు నివాళులర్పించారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


