శనివారం, 28 నవంబర్ 2026
వాతావరణం లోడ్ అవుతోంది...
తొలి కిరణం (Tholi Kiranam)
28-11-2026
అన్ని వార్తలు📰 ePaperతెలంగాణఆంధ్రప్రదేశ్భారత్అంతర్జాతీయవ్యాపారంక్రీడలుసాంకేతికతసినిమాఆరోగ్యంమా బృందం
హోమ్ఆంధ్రప్రదేశ్చిట్వేల్ రేంజ్‌లో ఘనంగా వన్యప్రాణి వారోత్సవాలు
ఆంధ్రప్రదేశ్తాజా కథనం

చిట్వేల్ రేంజ్‌లో ఘనంగా వన్యప్రాణి వారోత్సవాలు

చిట్వేల్ రేంజ్‌లో ఘనంగా వన్యప్రాణి వారోత్సవాలు
విద్యార్థులకు వన్యప్రాణుల సంరక్షణపై అటవీశాఖ అధికారుల అవగాహన
Paramalla Subramanyam
Paramalla Subramanyam
రిపోర్టర్
2026-10-07
4 నిమిషాల పఠనం
20 వీక్షణలు
అక్షర పరిమాణం:సాధారణ
షేర్ చేయండి:
చిట్వేల్ రేంజ్‌లో ఘనంగా వన్యప్రాణి వారోత్సవాలు

చిట్వేల్ రేంజ్‌లో ఘనంగా వన్యప్రాణి వారోత్సవాలు

చిట్వేల్ తొలి కిరణం న్యూస్, అక్టోబర్ 6: తిరుపతి జిల్లా చిట్వేల్ మండల పరిధిలో వన్యప్రాణి వారోత్సవాలను అటవీశాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. చిట్వేల్ హైస్కూల్, నాగవరం హైస్కూల్, జెడ్పీ హైస్కూల్ వెంకట్రాజుపల్లి, పెనగలూరు హైస్కూల్‌లలో విద్యార్థులకు వన్యప్రాణుల ప్రాధాన్యత, అటవీ పరిరక్షణ, జీవవైవిధ్యం, వన్యప్రాణుల ఆవాసాల రక్షణ, అడవి అగ్ని ప్రమాదాల నివారణ, అక్రమ వేట నిర్మూలన తదితర అంశాలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా అటవీశాఖ సిబ్బంది మాట్లాడుతూ.. అడవులు, వన్యప్రాణులు పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. అడవులు, వన్యప్రాణుల సంరక్షణ కేవలం అటవీశాఖ బాధ్యత మాత్రమే కాదని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించి ప్రకృతి సంపదను కాపాడాలని విద్యార్థులకు సూచించారు. ముఖ్యంగా అడవుల్లో అగ్ని ప్రమాదాలు సంభవించకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వన్యప్రాణులకు హాని కలిగించే చర్యలకు దూరంగా ఉండాలని కోరారు.
ఈ కార్యక్రమాల్లో అటవీశాఖ సిబ్బంది పి. శ్రీనివాసులు (ఎఫ్‌ఎస్‌ఓ), సావిత్రి (ఎఫ్‌ఎస్‌ఓ), చెంగమ్మ (పీబీఓ), సుబ్బయ్య (పీబీఓ), కరీముల్లా (ఎఫ్‌బీఓ), సుబ్బరాయుడు (ఎఫ్‌బీఓ), సుధాకర్ (ఎఫ్‌బీఓ), ఈశ్వరయ్య (ఏబీఓ) పాల్గొన్నారు.
ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల సహకారంతో వన్యప్రాణి వారోత్సవాల అవగాహన కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.

కథనానికి సంబంధించిన ట్యాగ్‌లు (Tags):
#ఆంధ్రప్రదేశ్#అనంతపూర్#అభివృద్ధి

పాఠకుల స్పందనలు & వ్యాఖ్యలు (0)

వ్యాఖ్యల మార్గదర్శకాలను పాటించండి

మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలపండి:

* అసభ్యకర మరియు ద్వేషపూరిత వ్యాఖ్యలు నిరోధించబడతాయి.

ట్రెండింగ్ వార్తలు (Trending)

TOP 5

తాజా వార్తా ముఖ్యాంశాలు

తొలి కిరణం (Tholi Kiranam)

తెలుగు ప్రజలకు నమ్మకమైన, వేగవంతమైన మరియు నిష్పాక్షిక వార్తలను అందించే మీ డిజిటల్ న్యూస్ పోర్టల్.

వార్తా విభాగములు

  • • తెలంగాణ
  • • ఆంధ్రప్రదేశ్
  • • భారత్
  • • అంతర్జాతీయ
  • • వ్యాపారం
  • • క్రీడలు
  • • సాంకేతికత
  • • సినిమా
  • • ఆరోగ్యం
  • • మా బృందం

ముఖ్యమైన లింకులు

  • మా గురించి (About Us)
  • మా బృందం (Our Team)
  • గోప్యతా విధానం (Privacy Policy)
  • నిబంధనలు & షరతులు (Terms)
  • ప్రకటనల ధరలు (Ad Tariffs)

కార్యాలయ వివరములు

  • contact@tholikiranam.com
  • +91 1800-425-8888

© 2026 తొలి కిరణం (Tholi Kiranam). All rights reserved.

గోప్యతా విధానం•డిస్క్లైమర్•సంప్రదించండి