తొలి కిరణం, అక్టోబర్ 6, ఘట్కేసర్ ప్రతినిధి:
మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసి వరుస చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అన్నోజీగూడకు చెందిన అలుగుబెల్లి రాము అలియాస్ జయరాం రెడ్డి (29) గతంలో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆన్లైన్ పెట్టుబడుల్లో నష్టాలు, ఉద్యోగం కోల్పోవడంతో ఆర్థిక ఇబ్బందులకు గురై చోరీలకు పాల్పడినట్లు వెల్లడించారు.
2026 ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య నల్గొండ జిల్లాలోని నార్కట్పల్లి, చిట్యాల, నల్లగొండ రూరల్, కట్టంగూర్, తిప్పర్తి పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 9 తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
ఆగస్టు 23న అన్నోజీగూడలో ఓ ఇంట్లో చోరీ చేసి సుమారు 14 తులాల బంగారు ఆభరణాలు, రూ.2 వేల నగదు అపహరించినట్లు పోలీసులు తెలిపారు. అక్టోబర్ 5న జోడిమెట్ల ఎక్స్ రోడ్ సమీపంలో బంగారు బిస్కెట్లు విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడి వద్ద నుంచి 20 గ్రాముల బంగారు బిస్కెట్, మరో 60 గ్రాముల బంగారు బిస్కెట్ ముక్కలు, అలాగే అతని నివాసం నుంచి మిగిలిన బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. కేసుపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


