మహబూబ్నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలో అర్హత కలిగిన గ్రాడ్యుయేట్లు ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవాలని బీజేపీ నేత, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2023 నవంబర్ నాటికి డిగ్రీ లేదా దానికి సమానమైన డిప్లొమా పూర్తి చేసిన అర్హత కలిగిన గ్రాడ్యుయేట్లు ఫారం–18 ద్వారా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 6 వరకు ఓటరు నమోదు ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు.
అర్హత కలిగిన అభ్యర్థి తప్పనిసరిగా మహబూబ్నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలో నివసిస్తున్న పౌరుడై ఉండాలని తెలిపారు.
కావలసిన పత్రాలు:
ఓటర్ ఐడీ కార్డు (EPIC)
ఆధార్ కార్డు
డిగ్రీ/గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్
పాస్పోర్ట్ సైజ్ ఫోటో
మొబైల్ నంబర్
అర్హత కలిగిన గ్రాడ్యుయేట్లు అవసరమైన పత్రాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని తల్లోజు ఆచారి తెలిపారు. గతంలో నమోదు చేసుకున్న వారు కూడా ప్రస్తుత ప్రక్రియలో మళ్లీ నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.
అర్హత కలిగిన ప్రతి గ్రాడ్యుయేట్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ పేరును ఎమ్మెల్సీ ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని తల్లోజు ఆచారి కోరారు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకునేందుకు:
ఫారం–18 ఆన్లైన్ నమోదు లింక్
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


