భువనగిరి: భువనగిరి పార్లమెంట్ సభ్యులు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కమ్యూనికేషన్ మరియు పబ్లిసిటీ చైర్మన్ శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డిపై సోషల్ మీడియాలో కొన్ని ఫేక్ ఛానెల్స్, నకిలీ ఖాతాల ద్వారా వీడియోలు రూపొందించి ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీపీసీసీ అధికార ప్రతినిధులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రాజకీయంగా ఎదుర్కోలేక సోషల్ మీడియా వేదికగా నకిలీ ఖాతాలు, ఫేక్ ఛానెల్స్ ద్వారా వీడియోలు రూపొందించి ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వ్యక్తులను గుర్తించి, చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని వారు సైబర్ క్రైమ్ అధికారులను కోరారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధులు మేడి రవిచంద్ర, మానవత్ రాయ్, ధరావత్ వెంకన్న నాయక్, బొజ్జ సంధ్యారెడ్డి, కిరణ్ యాదవ్, అల్లా భాస్కర్, శ్రీకాంత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


