కోడూరు, అక్టోబర్ 6: తిరుపతి జిల్లా రైల్వే కోడూరు పట్టణ కేంద్రంలో స్వాతంత్ర్య సమరయోధుడు, రేనాటి వీరుడు వడ్డె ఓబన్న వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రైల్వే కోడూరు మండలంలోని వడ్డె ఓబన్న విగ్రహానికి స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్, మండల అధ్యక్షులు రామిరెడ్డి ధ్వజారెడ్డి, మాజీ ఉప సర్పంచ్ తోట శివసాయి తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా రామిరెడ్డి ధ్వజారెడ్డి మాట్లాడుతూ బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి నేతృత్వంలో సాగిన పోరాటంలో వడ్డె ఓబన్న కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఆయన ధైర్యసాహసాలు, త్యాగాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయని పేర్కొన్నారు. వడ్డె ఓబన్న స్ఫూర్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకుని దేశ సేవకు అంకితం కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బత్తల సుబ్రమణ్యం, గోపి, బత్తల మణి, మాజీ సర్పంచులు హరికృష్ణారెడ్డి, చెంగల్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, సుబ్రమణ్యం రాజు, మాజీ ఎంపీటీసీ ఆనంద్ యాదవ్, షఫీ, కృష్ణారెడ్డి, శ్రీనివాసులురెడ్డి, అనంతరాజుపేట షఫీ, ప్రసాద్, రెడ్డయ్యరెడ్డి, రమణరెడ్డి, కుంచం హరి, అనిల్‌రెడ్డి, నాగరాజు తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు, వడ్డెర సంఘం ప్రతినిధులు పాల్గొని వడ్డె ఓబన్నకు ఘన నివాళులర్పించారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


