చిట్వేలు, అక్టోబర్ 6: తిరుపతి జిల్లా చిట్వేలు మండల ప్రజలకు శుభవార్త. చిట్వేలు మండలం, పరిసర గ్రామాల ప్రజల కోసం పుష్పగిరి కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ప్రత్యేక ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నారు. చిట్వేలు మాజీ ఉప సర్పంచ్ చౌడవరం ఉమామహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ వైద్య శిబిరం నిర్వహించనున్నారు.
ఈ నెల 7వ తేదీ బుధవారం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు చిట్వేలు గ్రామపంచాయతీ కార్యాలయంలో కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నారు. శిబిరంలో కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి వైద్యుల సూచనలు, చికిత్స అందించనున్నారు.
చిట్వేలు మండలం, పరిసర గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని శిబిరానికి హాజరై కంటి పరీక్షలు చేయించుకోవాలని నిర్వాహకులు కోరారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


