నకిరేకల్ క్యాంపు కార్యాలయం: చిట్యాల మండలం పిట్టంపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీకి నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా నూతన గ్రామశాఖ అధ్యక్షుడు మేడి విష్ణువర్ధన్తో పాటు నూతన కార్యవర్గ సభ్యులకు ఎమ్మెల్యే వేముల వీరేశం శుభాకాంక్షలు తెలిపారు. గ్రామంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.
గ్రామస్థాయిలో పార్టీ కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే సూచించారు. నూతన కార్యవర్గం పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్, గ్రామ కాంగ్రెస్ నాయకులు, ఉపాధ్యక్షులు జక్కల రాజు, నారగోని లింగస్వామి, అందే శేఖర్, ప్రధాన కార్యదర్శి మెట్టు వెంకటేశ్వర్లు, కార్యదర్శులు అంతటి సత్తయ్య, మహిళ భిక్షమయ్య, మేడి లింగస్వామి, బాతరాజు సుక్కులు, మేడి నరేష్ తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


