నాగర్‌కర్నూల్ ప్రతినిధి, అక్టోబర్ 5: ఎస్సీ కమిషన్ చైర్మన్, సభ్యుల నియామకాల్లో సామాజిక న్యాయాన్ని ప్రతిబింబించేలా రొటేషన్ విధానాన్ని అమలు చేసి, మాదిగ, అనుబంధ ఉపకులాలకు చెందిన అర్హత, అనుభవం కలిగిన జర్నలిస్టులకు సముచిత ప్రాతినిధ్యం కల్పించాలని తెలంగాణ మాదిగ జర్నలిస్టు ఫోరం (టీఎంజేఎఫ్) రాష్ట్ర అధికార ప్రతినిధి పంగిడి చెరువు వెంకటేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఎస్సీ-ఎస్టీ కమిషన్ ప్రస్తుత పదవీకాలం ముగిసిన నేపథ్యంలో చేపట్టనున్న నూతన నియామకాల్లో జర్నలిజం రంగంలో సేవలందిస్తున్న అర్హత, అనుభవం కలిగిన మాదిగ, అనుబంధ ఉపకులాల ప్రతినిధులను చైర్మన్, సభ్యులుగా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.
ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో, అణగారిన వర్గాల గొంతుకను ప్రభుత్వానికి చేరవేయడంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారని వెంకటేష్ పేర్కొన్నారు. ఇప్పటివరకు జరిగిన నియామకాలకు భిన్నంగా రొటేషన్ విధానాన్ని అమలు చేసి అన్ని సామాజిక వర్గాలకు అవకాశం కల్పించడం ద్వారా కమిషన్‌పై ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ముఖ్యంగా మాదిగ, అనుబంధ ఉపకులాలకు చెందిన అర్హత, అనుభవం ఉన్న జర్నలిస్టులకు ఈసారి అవకాశం కల్పించాలని ఆయన స్పష్టం చేశారు. సామాజిక న్యాయం కేవలం మాటల్లో కాకుండా నియామకాల్లోనూ ప్రతిఫలించాలని వెంకటేష్ అన్నారు.
ఈ డిమాండ్‌పై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, నూతన కమిషన్ నియామకాల్లో మాదిగ జర్నలిస్టులకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. ఈ అంశాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లేందుకు రాష్ట్రవ్యాప్తంగా వినతిపత్రాల సమర్పణ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


