చిట్వేల్, సెప్టెంబర్ 29: తిరుపతి జిల్లా చిట్వేల్ మండల వ్యాప్తంగా మంగళవారం ఎస్ఎంసీ (స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ) ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. మండల పరిధిలోని 55 ప్రాథమిక పాఠశాలలు, 5 ప్రాథమికోన్నత పాఠశాలలు, ఒక కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఎస్ఎంసీ ఎన్నికలు నిర్వహించినట్లు మండల విద్యాశాఖ అధికారులు ఖాజా మొహిద్దిన్, ఈశ్వరులు తెలిపారు.
చిట్వేల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుల అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఎస్ఎంసీ చైర్మన్‌గా జడపోలు శివప్రసాద్ గౌడ్, వైస్ చైర్మన్‌గా చనమాల చెంచులక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 19 మంది సభ్యులతో కూడిన కమిటీని ఆమోదించారు.
ఈ సందర్భంగా నూతన చైర్మన్ శివప్రసాద్ గౌడ్‌ను వైస్ చైర్మన్ చెంచులక్ష్మి, ఇన్చార్జి ప్రధానోపాధ్యాయురాలు సోఫియా, ఉపాధ్యాయులు, టీడీపీ మండల అధ్యక్షుడు కాకర్ల నాగార్జున తదితరులు ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రెండేళ్లపాటు చైర్మన్‌గా సేవలందించిన శంకర్‌రాజును కూడా సత్కరించారు.
నూతన చైర్మన్ శివప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ తనపై ఉంచిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల విద్యాభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. తనకు ఈ అవకాశం రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు కొండా వెంకటేష్, బి. రాజశేఖర్, చందు, కూటమి నాయకులు, ఉపాధ్యాయులు, ఎస్ఎంసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


