తెలకపల్లి: తెలకపల్లి మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని 10వ వార్డులో కాలనీ పరిశుభ్రత, ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శ్రీకారం చుట్టారు. స్థానిక వార్డు మెంబర్ కొమ్ము రాకేష్ ఆధ్వర్యంలో డ్రైనేజీ పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా వార్డు మెంబర్ కొమ్ము రాకేష్ మాట్లాడుతూ.. కాలనీలో మురుగు నీరు నిల్వ ఉండకుండా, పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపట్టినట్లు తెలిపారు. మురుగు నీరు నిల్వ ఉండటం వల్ల మలేరియా, డెంగ్యూ తదితర వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. డ్రైనేజీ వ్యవస్థను సక్రమంగా వినియోగించుకోవడంతో పాటు ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ సొంటె మల్లేష్, గ్రామ నాయకులు కొమ్ము ఆనంద్, మల్లేష్, లక్ష్మణ్, శ్రీకాంత్, విజయ్‌తో పాటు పలువురు కాలనీవాసులు పాల్గొన్నారు
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


