తెలకపల్లి, అక్టోబర్ 5: తెలంగాణ సగర మహిళా కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలిగా తెలకపల్లికి చెందిన అతినారపు విజయలక్ష్మి నియమితులయ్యారు. సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర ఆమెను తెలంగాణ సగర మహిళా కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమిస్తూ బాధ్యతలు అప్పగించారు.
తెలకపల్లికి చెందిన మహిళకు రాష్ట్రస్థాయిలో కీలక బాధ్యతలు లభించడం పట్ల తెలకపల్లి సగర సంఘం సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అతినారపు విజయలక్ష్మిని పలువురు అభినందించారు. రాష్ట్రస్థాయిలో తనకు బాధ్యతలు అప్పగించిన సగర సంఘం రాష్ట్ర నాయకత్వానికి విజయలక్ష్మితో పాటు తెలకపల్లి మండల సగర సంఘం సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సగర మహిళా సంఘాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు సగర మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. మహిళలను సంఘటితం చేసి వారి హక్కులు, అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తానని పేర్కొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


