తెలకపల్లి, అక్టోబర్ 5: అచ్చంపేటలో నిర్వహించిన డివిజన్ స్థాయి కరాటే, కుంగ్‌ఫూ ఓపెన్ ఛాంపియన్షిప్–2026లో ఎస్ఆర్ పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. ముకేష్ మాస్టర్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ, ఏఆర్ స్పోర్ట్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో ఎస్ఆర్ పాఠశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని అద్భుత ప్రతిభ కనబరిచారు.
ఈ పోటీల్లో ఎస్ఆర్ పాఠశాల జట్టు ద్వితీయ బహుమతి సాధించడంతో పాటు పలువురు విద్యార్థులు వ్యక్తిగత విభాగాల్లో మెడల్స్ కైవసం చేసుకున్నారు. విద్యార్థుల ప్రతిభకు నిర్వాహకులు, పాఠశాల యాజమాన్యం అభినందనలు తెలిపారు.
కరాటే, కుంగ్‌ఫూ వంటి మార్షల్ ఆర్ట్స్‌తో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, ధైర్యం, శారీరక దారుఢ్యం పెంపొందుతాయని నిర్వాహకులు తెలిపారు. పాఠశాల కరాటే మాస్టర్ స్రవంతి పోటీల్లో పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. క్రీడలతో పాటు విద్యలోనూ రాణించాలని, మార్షల్ ఆర్ట్స్‌ను ఆత్మరక్షణతో పాటు వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగించుకోవాలని సూచించారు.
విజేత విద్యార్థులను పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందించారు. మాస్టర్ రవి నాయక్ (డైరెక్టర్), మాస్టర్ ముకేష్ (చీఫ్ ఆర్గనైజర్) ఆధ్వర్యంలో పోటీలు విజయవంతంగా నిర్వహించారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


