కోడూరు, తొలి కిరణం, అక్టోబర్ 4: తిరుపతి జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గం పట్టణంలోని ఆర్ఆర్ కాంప్లెక్స్ సమీపంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ–అథవాలే) నూతన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆర్పీఐ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర సామాజిక న్యాయ మరియు సాధికారత శాఖ సహాయ మంత్రి రాందాస్ అథవాలే ఆదేశాల మేరకు నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్పీఐ రాష్ట్ర అధ్యక్షుడు కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లుతూ పార్టీని బలోపేతం చేస్తామని తెలిపారు. ఆర్పీఐ కుల, మత, వర్గాలకు అతీతంగా అందరినీ కలుపుకుపోయే పార్టీ అని, ప్రతి ఒక్కరూ తమ హక్కులను సాధించుకునేందుకు పార్టీ వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, సామాజిక న్యాయం కోసం పార్టీ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో తిరుపతి జిల్లా అధ్యక్షులు చోడవరం సుబ్బ నరసయ్య, కడప రమణ, ఆర్పీఐ స్టేట్ బీసీ సెల్ ప్రెసిడెంట్ వంకదార శ్రీనివాసరావు, స్టేట్ జనరల్ సెక్రటరీ జవాజి ఫణేందర్, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ముత్తయ్య, మహిళా అధ్యక్షురాలు కప్పల ప్రమీల, నెల్లూరు జిల్లా మహిళా ప్రెసిడెంట్ షావుకారి సరస్వతి, పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.


