తొలి కిరణం, అక్టోబర్ 4: రైల్వే కోడూరు పట్టణంలోని బైపాస్ రోడ్డుకు చెందిన 22 ఏళ్ల షేక్ సారా కుటుంబ సమస్యల కారణంగా రైల్వే కోడూరు రైల్వే స్టేషన్ వద్ద రైలు కింద పడి ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్నట్లు డయల్-100కు సమాచారం అందింది. సమాచారం అందుకున్న వెంటనే రైల్వే కోడూరు పట్టణ పోలీసులు అప్రమత్తమై సంఘటనా స్థలానికి చేరుకుని, ఆమె రైలు కింద పడకుండా సకాలంలో రక్షించారు. అనంతరం మహిళకు కౌన్సెలింగ్ నిర్వహించి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారి సమక్షంలో ఆమెను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆపదలో ఉన్న వారు లేదా ఆత్మహత్యకు ప్రయత్నించే పరిస్థితుల్లో ఉన్నవారు వెంటనే డయల్-100 లేదా 112కు సమాచారం అందించాలని రైల్వే కోడూరు పోలీసులు సూచించారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


