బిజినపల్లి, అక్టోబర్ 4 (నినాదం): తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యశ్రీ ఉద్యోగుల సంఘం నూతన రాష్ట్ర కమిటీ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. ఈ ఎన్నికల్లో బిజినపల్లి మండలం పాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న పి. విష్ణు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా, వట్టెం గ్రామానికి చెందిన సమీర్ బాబా రాష్ట్ర కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడిగా గిరి యాదయ్య ఎన్నికయ్యారు.
రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న ఆరోగ్యశ్రీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నూతన కమిటీ కృషి చేస్తుందని ఎన్నికైన నాయకులు తెలిపారు. ఎన్నికకు సహకరించిన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఆరోగ్యశ్రీ ఉద్యోగులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
బిజినపల్లి మండలానికి చెందిన పి. విష్ణు, సమీర్ బాబా రాష్ట్ర కమిటీలో కీలక బాధ్యతలకు ఎన్నిక కావడం పట్ల నాగర్కర్నూల్ జిల్లా ఆరోగ్యశ్రీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.


