తొలి కిరణం, నాగర్ కర్నూల్: తెలంగాణ కుకింగ్ గ్యాస్ డెలివరీ వర్కర్స్ యూనియన్ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడిగా బచ్చలి బంగారయ్య నియమితులయ్యారు. ఈ మేరకు గౌరవ రాష్ట్ర అధ్యక్షుడు నకిరేకంటి శ్రీనివాస్ గౌడ్ నియామక పత్రాన్ని బచ్చలి బంగారయ్యకు అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ డెలివరీ వర్కర్ల సమస్యల పరిష్కారానికి యూనియన్ ద్వారా కృషి చేయాలని సూచించారు. జిల్లా అధ్యక్షుడిగా తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర నాయకత్వానికి బచ్చలి బంగారయ్య కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చామకూర రాజు, బాలస్వామి, డెలివరీ వర్కర్లు చెన్నకేశవులు, పరమేశ్వర్, రామారావు, రామస్వామి, కిషోర్, నరేష్, శివాజీ, పెద్దకొత్తపల్లి రాము తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


