ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్ల పథకం
అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ప్రయోజనం అందేలా చర్యలు
తొలి కిరణం, అక్టోబర్ 4, అచ్చంపేట: అచ్చంపేట నియోజకవర్గం బల్మూర్ మండలం చెంచుగూడెంలో ఆదివారం నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో TPCC ఉపాధ్యక్షులు, DCC అధ్యక్షులు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రయోజనం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలకు సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడంలో ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


