వంగూర్ మండలం చౌదర్పల్లి గ్రామంలో పాడి పశువుల గర్భకోశ వ్యాధుల చికిత్స కోసం ప్రత్యేక వైద్య శిబిరాన్ని వంగూర్ మండల పశువైద్యాధికారి డాక్టర్ ఎలికంటి మల్లేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. పశుసంవర్ధక శాఖ, పశుగణాభివృద్ధి సంస్థ సంయుక్తంగా నిర్వహించిన ఈ శిబిరంలో పాడి పశువులకు అవసరమైన వైద్య పరీక్షలు, చికిత్సలు అందించారు. ఈ సందర్భంగా పాడి పశువుల ఆరోగ్యం, గర్భకోశ సంబంధిత సమస్యలపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎద్దుల చూడామణి, డిప్యూటీ సర్పంచ్ మెనుగొండ లవకుమార్, పంచాయతీ కార్యదర్శి గంగ రాములు, వార్డు సభ్యులు, పాడి రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. డాక్టర్ ఎలికంటి మల్లేష్తో పాటు సిబ్బంది శ్రీనివాసులు, జె.వీవో లక్ష్మణ్, ఎల్ఎస్ఏ మురళీధర్ రెడ్డి, గోపాలమిత్ర సూపర్వైజర్, గోపాలమిత్రులు నాగరాజు, సైదయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


