బిజినపల్లి: మండల కేంద్రంలో అంగన్వాడీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సేవా సంకల్ప అభియాన్ మండల కన్వీనర్ కురవి శ్రీకాంత్ శర్మ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలు కేవలం పిల్లలకు ఆహారం అందించే కేంద్రాలు మాత్రమే కాకుండా చిన్నారుల ఆరోగ్యం, పోషణ, ప్రారంభ విద్యకు పునాదిగా నిలుస్తున్నాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సాక్షమ్ అంగన్వాడీ & పోషణ్ 2.0 ద్వారా చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు పోషకాహార సహాయం, ప్రీ-స్కూల్ విద్య, ఆరోగ్య–పోషణ అవగాహన, ఆరోగ్య పరీక్షలు, టీకాలు, అవసరమైనప్పుడు రిఫరల్ సేవలు అందుతున్నాయని తెలిపారు. పోషణ్ భీ, పఢాయీ భీ కార్యక్రమం ద్వారా చిన్నారులకు చిన్న వయస్సు నుంచే ఆటల ఆధారిత అభ్యాసం, ప్రారంభ విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు. అలాగే పోషణ్ ట్రాకర్ ద్వారా అంగన్వాడీ సేవలను డిజిటల్‌గా పర్యవేక్షిస్తూ పిల్లల పోషక స్థితి, సేవల పంపిణీని మరింత సమర్థవంతంగా ట్రాక్ చేస్తున్నారని వివరించారు.
మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు పద్మ యాదవ్ మాట్లాడుతూ మహిళ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని, తల్లి ఆరోగ్యంగా ఉంటే బిడ్డ ఆరోగ్యంగా ఎదుగుతుందని అన్నారు. అంగన్వాడీ ఉత్సవాల్లో ప్రతి తల్లి భాగస్వామి కావాలని, మహిళలకు అందుబాటులో ఉన్న పోషణ, ఆరోగ్యం, మాతృత్వం, బాలల అభివృద్ధి, మహిళా సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించాలని సూచించారు. అర్హత ఉన్న ప్రతి మహిళ, ప్రతి తల్లి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను తెలుసుకుని పొందేలా అందరూ సహకరించాలని కోరారు.
ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకుల సేవలను అభినందిస్తూ ప్రత్యేకంగా సత్కరించారు. రోజువారీగా చిన్నారులు, తల్లులతో కలిసి పోషణ, ఆరోగ్యం, ప్రారంభ విద్య వంటి సేవలను ప్రజలకు చేరువ చేస్తున్న అంగన్వాడీ సిబ్బంది సేవలను కొనియాడారు. మాతృ సంవాదం కార్యక్రమంలో లబ్ధిదారు తల్లులు తమకు అందుతున్న ప్రయోజనాలు, అనుభవాలు, సూచనలను పంచుకునే అవకాశం కల్పించారు. పోషణ, విద్య, ఆరోగ్యం, టీకాలు, మాతృ ఆరోగ్యం, మహిళా సాధికారత, బాలల అభివృద్ధిపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సునీత, అంగన్వాడీ టీచర్లు, సీనియర్ నాయకులు లక్ష్మణ్, రఘుబాబు, తిరుపతయ్య, మహేష్, BJYM నాయకులు సంతోష్ కుమార్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


