తెలకపల్లి, అక్టోబర్ 2, తొలి కిరణం: తెలకపల్లి మండల కేంద్రంలోని సిద్ధార్థ విద్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి నివాళులర్పించి ఆయన సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ శాంతి, అహింసా మార్గంలో స్వాతంత్ర్య ఉద్యమాన్ని నడిపిన మహాత్మా గాంధీ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. విద్యార్థులు గాంధీజీ అడుగుజాడల్లో నడుస్తూ శాంతి, అహింస, సత్యం వంటి విలువలను జీవితంలో పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


