రైల్వే కోడూరు: సామాజిక సేవా రంగంలో విశేషంగా కృషి చేస్తున్న తిరుపతి జిల్లా రైల్వే కోడూరు మండలం వై.కోటకు చెందిన అంకిపల్లి శివకుమార్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్‌గా మానవ హక్కులపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు అవసరమైన వారికి అండగా నిలుస్తున్న ఆయన సేవలను గుర్తించి గౌరవ డాక్టరేట్ అవార్డును ప్రదానం చేశారు.
న్యూఢిల్లీలో సెప్టెంబర్ 30న నిర్వహించిన “హానరరీ అవార్డ్ శిరోమణి” కార్యక్రమంలో వివిధ రంగాల్లో సేవలందించిన పలువురు ప్రముఖులను సత్కరించారు. ఇందులో భాగంగా సోషల్ వర్క్ విభాగంలో అంకిపల్లి శివకుమార్ అందిస్తున్న సేవలను గుర్తించిన యూనివర్సల్ హానరరీ అవార్డ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఆయనకు గౌరవ డాక్టరేట్ అవార్డును అందజేశారు.
మానవ హక్కుల పరిరక్షణ, ప్రజల్లో అవగాహన కల్పించడం, అవసరమైన వారికి సహాయం అందించడం వంటి సేవలను గుర్తించి ఈ పురస్కారం అందించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా అంకిపల్లి శివకుమార్ మాట్లాడుతూ తన సేవలను గుర్తించి గౌరవ డాక్టరేట్ అవార్డును అందించిన యూనివర్సల్ హానరరీ అవార్డ్ కౌన్సిల్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డు తనపై మరింత బాధ్యతను పెంచిందని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు అండగా నిలుస్తానని పేర్కొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


