కల్వకుర్తి: జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని కల్వకుర్తి మున్సిపాలిటీ ఆవరణలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని గాంధీజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, కల్వకుర్తి మున్సిపల్ చైర్పర్సన్ బృంగి రత్నమాల ఆనంద్ పాల్గొన్నారు. గాంధీజీ ఆశయాలు, సత్యం, అహింస, స్వచ్ఛత, ప్రజాసేవ వంటి విలువలను స్మరించుకున్నారు.
కార్యక్రమంలో కల్వకుర్తి మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ షానవాజ్ ఖాన్, పలువురు కౌన్సిలర్లు, కల్వకుర్తి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు విజయ్ కుమార్ రెడ్డి, కల్వకుర్తి మండల కాంగ్రెస్ అధ్యక్షులు బాల్ రెడ్డి, కల్వకుర్తి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పుస్తకాల రాహుల్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


