లింగాల: మేజర్ గ్రామపంచాయతీ లింగాలలో సర్పంచ్ పూజారి ఈశ్వరమ్మ బుడ్డయ్య అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సర్పంచ్ నాయకపు వీరస్వామి, పంచాయతీ కార్యదర్శి వీరస్వామి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా VBG RAM G (MGNREGS) ద్వారా గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, ఉపాధి హామీ పనులు, నీటి సంరక్షణ కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు. వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, గ్రామ మౌలిక వసతుల అభివృద్ధి, గ్రామీణులకు ఉపాధి అవకాశాల కల్పన తదితర అంశాలపై గ్రామస్థుల అభిప్రాయాలను స్వీకరించారు.
గ్రామ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను ప్రాధాన్యత క్రమంలో చేపట్టేందుకు సమావేశంలో చర్చించారు. గ్రామ అభివృద్ధికి అవసరమైన పనులను గుర్తించి, ఉపాధి హామీ పథకం ద్వారా ప్రజలకు ప్రయోజనం కలిగేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, గ్రామ పెద్దలు, యువకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


