నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాధారణ ఆస్పత్రిలో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో వైద్యులు, నర్సింగ్ అధికారులు, ఆరోగ్య సిబ్బంది జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ డా. సి. నిఖిల్ రెడ్డి, డా. నమిత సంయుక్తంగా సిబ్బందితో కలిసి గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా గాంధీజీ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని, ప్రజాసేవతో పాటు ఆరోగ్య పరిరక్షణలో నిబద్ధతతో పనిచేయడమే మహాత్మా గాంధీకి నిజమైన నివాళి అని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్లు, డాక్టర్ రమ్యశ్రీ, నర్సింగ్ సూపరింటెండెంట్ పేర్సి సుమన్, రెనుక, హెడ్ నర్సులు నిర్మల, పద్మ, సునిత, శ్వేత, నర్సింగ్ అధికారులు, ఇతర ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


