తొలి కిరణం ప్రతినిధి.నాగర్ కర్నూల్
పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిబా పూలే, దివంగత నేత, మాజీ మంత్రి మహేంద్రనాథ్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, అల్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీ మల్లు రవి, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పాల్గొని విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబా పూలే సమాజంలో సామాజిక అసమానతలను తొలగించేందుకు, అణగారిన వర్గాల అభ్యున్నతికి విశేషంగా కృషి చేసిన మహనీయుడని అన్నారు. విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన పూలే మహిళలు, వెనుకబడిన వర్గాల విద్యాభివృద్ధికి చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. అలాగే దివంగత నేత, మాజీ మంత్రి మహేంద్రనాథ్ ప్రజల కోసం చేసిన సేవలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ప్రజా జీవితంలో ఆయన అందించిన సేవలు, ప్రజలతో ఆయనకు ఉన్న అనుబంధం ఎప్పటికీ గుర్తుండిపోతాయని తెలిపారు. మహనీయుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే వారికి అందించే నిజమైన నివాళి అని ఎమ్మెల్యే వంశీకృష్ణ పేర్కొన్నారు.కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


