తొలి కిరణం . ప్రతినిధి, బిజినపల్లి :
బిజినపల్లి మండలం పాలెం మేజర్ గ్రామపంచాయతీ ఆవరణలో, మహాత్మా గాంధీ విగ్రహం వద్ద గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గాంధీజీ చూపిన అహింసా మార్గం, సత్యం, స్వచ్ఛ భారత్ స్ఫూర్తిని కొనసాగించాలని ప్రతిజ్ఞ చేశారు.అనంతరం వికసిత్ గ్రామ పంచాయతీ ప్లాన్ (VGPP) గ్రామసభను గ్రామపంచాయతీ ఆవరణలో నిర్వహించారు. గ్రామ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై గ్రామసభలో చర్చించారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ శివకృష్ణ, సర్పంచ్ రామకృష్ణ ,ఉపసర్పంచ్ గోవిందు శ్రీనివాసులు, వార్డు మెంబర్లు కోట్ల హేమలత, వస్పరి శివ, నాగులు, గోవిందు కాశన్న, బోనాసి ప్రదీప్, దొంతరమోనీ పరశురాములు, మాజీ ఎంపీపీ పుప్పాల శ్రీనివాస్ గౌడ్, మాజీ ఉపసర్పంచ్ ఎండి ఖదీర్, చింతల నరసింహ, ఎండి మైనుద్దీన్, బోనాసి చంద్రశేఖర్, ఆర్యవైశ్య సంఘ సభ్యులు కొత్త బాలరాజు, కిరణ్, సంతోష్, సుబ్రమణ్యం, అంగన్వాడీ టీచర్లు, క్లాస్మేట్ క్లబ్ సంఘ సభ్యులు గాడి సురేందర్, నాగిరెడ్డి, సొప్పరి బాలస్వామి, హెల్త్ అసిస్టెంట్ గోవర్ధన్, ఏఎన్ఎం సరస్వతమ్మ, ఆశా వర్కర్లు, వెటర్నరీ డాక్టర్ ప్రణీత, గ్రామపంచాయతీ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


