నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస్ ముదిరాజ్‌ను అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చిరు సన్మానం చేసి అభినందించారు. ఈ సందర్భంగా గువ్వల బాలరాజు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూనే ఓబీసీ వర్గాల కోసం నిరంతరం పనిచేయాలని శ్రీనివాస్‌కు సూచించారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ పార్టీ అభివృద్ధికి, ఓబీసీ వర్గాల సంక్షేమానికి కృషి చేస్తానని శ్రీనివాస్ ముదిరాజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రమణారెడ్డి, మండల నాయకులు చిన్నారెడ్డి, నరేందర్ చారి, కృష్ణ, వెంకటేష్, వసంత్ గౌడ్ తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


