అచ్చంపేట: అచ్చంపేట పట్టణంలోని అంబేద్కర్ ప్రజా భవన్లో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. TPCC ఉపాధ్యక్షులు, DCC అధ్యక్షులు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ పాల్గొని గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గాంధీజీ చూపిన సత్యం, అహింస, శాంతి, సామరస్య మార్గాలు నేటి సమాజానికి స్ఫూర్తిదాయకమన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం మహాత్మా గాంధీ చేసిన త్యాగాలను స్మరించుకుంటూ, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


