తొలి కిరణం అక్టోబర్ 02 ఘట్కేసర్ ప్రతినిధి
మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంస్కృతి టౌన్షిప్లో కొనసాగుతున్న పేకాట స్థావరంపై ఉప్పల్ జోన్ ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం నిర్వహించిన దాడిలో పేకాట ఆడుతున్న ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. పేకాట నిర్వహిస్తున్న ప్రాంతాన్ని గుర్తించిన ఎస్ఓటీ బృందం ఒక్కసారిగా దాడి చేసింది. ఈ సందర్భంగా కొమురయ్య, గుండు వెంకటేశ్వర్లు, అముద శ్రీనివాస్, జోలుకుంట్ల సుకృత్రెడ్డి, కుక్కునూరు రామచంద్రరెడ్డి, గుడిపాటి కరుణాకర్రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి మూడు సెట్ల పేకముక్కలు, ఆరు స్మార్ట్ఫోన్లతో పాటు రూ.89,980 నగదును స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడిన వారిని పోచారం ఐటీ కారిడార్ పోలీసులకు అప్పగించగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పేకాట, జూదం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోచారం ఇన్స్పెక్టర్ జగన్నాథ్ హెచ్చరించారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


