బిజినపల్లి: నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ పాఠశాలలో నిర్వహించిన జిల్లాస్థాయి ఎస్జీఎఫ్ క్రీడా పోటీల్లో బిజినపల్లి జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. అండర్–14 కోకో విభాగంలో సాకేత్, అండర్–14 వాలీబాల్ విభాగంలో రఘువర్ధన్ ప్రతిభ కనబరిచి జిల్లా జట్లకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కృష్ణయ్య, పీడీ నిరంజన్ యాదవ్‌తో పాటు ఉపాధ్యాయ బృందం విద్యార్థులను అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


