తెలకపల్లి మండలం గౌరెడ్డిపల్లి హైస్కూల్‌కు చెందిన విద్యార్థినులు హ్యాండ్‌బాల్ క్రీడలో ప్రతిభ చాటి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 30న ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా స్థాయిలో నిర్వహించిన అండర్–14, అండర్–17 బాలికల హ్యాండ్‌బాల్ సెలక్షన్స్‌లో పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థినులు ఏ. రిత్విక, పీ. హర్షిత ప్రతిభ కనబరిచారు. అండర్–14 విభాగంలో ఏ. రిత్విక, అండర్–17 విభాగంలో పీ. హర్షిత రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. విద్యార్థినుల ప్రతిభపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె. శివ ప్రసాద్, వ్యాయామ ఉపాధ్యాయురాలు గణేశ్వరి, ఉపాధ్యాయ బృందం, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పాఠశాలకు, గౌరెడ్డిపల్లి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ విద్యార్థినులను అభినందించారు.


