తెలకపల్లి మండలంలోని పలు పాఠశాలల్లో విద్యార్థులకు ‘వికసిత్ భారత్’ అంశంపై చిత్రలేఖనం, ఉపన్యాస పోటీలు నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 సంవత్సరాల సేవను పురస్కరించుకుని సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ఈ పోటీలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు మందా చిన్నారెడ్డి, కిసాన్ మోర్చా నాయకుడు రమణారెడ్డి, పీజియన్ మండల అధ్యక్షుడు సూర్య భాస్కర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి రాజు, మధుసూదన్ గౌడ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


