బిజినాపల్లి, అక్టోబర్ 1: బిజినాపల్లి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహ బేకరీలో కుళ్లిపోయిన ఐస్‌క్రీమ్ బన్స్ విక్రయిస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో ఆహార భద్రత అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. బుధవారం సాయంత్రం బేకరీలో ఐస్‌క్రీమ్ కొనుగోలు చేసేందుకు వెళ్లిన కొందరు వినియోగదారులకు పాడైపోయిన ఐస్‌క్రీమ్ బన్స్ కనిపించడంతో ఈ విషయాన్ని ఆహార భద్రత అధికారి శ్రీలతకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
ఫిర్యాదు అందుకున్న అధికారులు మరుసటి రోజు బేకరీలో తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో ఐస్‌క్రీమ్‌తో పాటు ఇతర ఆహార పదార్థాలను పరిశీలించిన అధికారులు శనగపప్పు, మైదాపిండి తదితర పదార్థాల నమూనాలను సేకరించారు. సేకరించిన నమూనాలను పరీక్షలకు పంపామని, పరీక్షల నివేదికలు వచ్చిన అనంతరం నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేస్తామని ఆహార భద్రత అధికారి శ్రీలత తెలిపారు.
ఈ బేకరీపై గతంలో కూడా కుళ్లిపోయిన బ్రెడ్‌కు సంబంధించి ఆరోపణలు వచ్చినట్లు స్థానికులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఐస్‌క్రీమ్ బన్స్ విషయంలోనూ ఫిర్యాదులు రావడంతో అధికారులు తనిఖీలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. తనిఖీల సమయంలో ఆహార భద్రత సిబ్బంది వాజిద్‌తో పాటు స్థానిక వినియోగదారులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


