కల్వకుర్తి నియోజకవర్గం కల్వకుర్తి మండలం తర్నికల్ గ్రామానికి చెందిన శ్రీశైలం కుమార్తె సౌమ్య గ్రామీణ ప్రాంతంలో పుట్టి పెరిగి వైద్య విద్యలో సీటు సాధించడం పట్ల రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఉప్పల వెంకటేష్ సౌమ్యను అభినందించారు. వైద్య విద్యను కొనసాగించేందుకు అయ్యే ఖర్చుల కోసం ఆర్థిక సహాయం అందించి, ఆమె విద్యాభ్యాసానికి అండగా ఉంటానని ఉప్పల వెంకటేష్ తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఉన్నత విద్యలో రాణించేందుకు ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కల్వకుర్తి మార్కెట్ చైర్మన్ వట్టేపు బాలయ్య, మాజీ మండల కో ఆప్షన్ సభ్యుడు రుక్ముద్దీన్, హాజిలాపూర్ సర్పంచ్ సిద్ధగొని రమేష్ గౌడ్, మాజీ ఉప సర్పంచ్ కర్ణాకర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తాళ్ల సురేష్ గౌడ్, వర్కాల దేవయ్య, మాణిక్య రావు, వాటం రవి, ఉప్పల వెంకటేష్ సైన్యం వంశీ తదితరులు పాల్గొన్నారు.


