కర్మన్‌ఘాట్‌లో మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని బీఆర్ఎస్ కల్వకుర్తి నియోజకవర్గ ఇన్చార్జి జైపాల్ యాదవ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెల్దండ సింగిల్ విండో చైర్మన్ జూపల్లి భాస్కర్ రావు మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి చేపట్టాల్సిన సన్నాహక కార్యక్రమాలపై సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు తెలిపారు. ముఖ్యంగా కొత్తగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన పట్టభద్రులను గుర్తించి, అర్హత ఉన్న వారితో ఓటు నమోదు చేయించడం, ఇప్పటికే పట్టభద్రుల ఓటు ఉన్న వారి వివరాలను సేకరించడం వంటి అంశాలపై చర్చించినట్లు పేర్కొన్నారు. అలాగే పట్టభద్రుల ఓటరు జాబితాలో అర్హులైన ప్రతి ఒక్కరి వివరాలు సక్రమంగా నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని సమావేశంలో చర్చించినట్లు తెలిపారు.


