కల్వకుర్తి: నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సహకారంతో ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాబ్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా తుక్కుగూడలోని ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీలో ఉద్యోగ ఇంటర్వ్యూలు నిర్వహించారు.
ఈ జాబ్ డ్రైవ్‌కు కల్వకుర్తి నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి మొత్తం 21 మంది నిరుద్యోగ యువత హాజరయ్యారు. ఇందులో వెల్దండ మండలం నుంచి 2 మంది, ఆమనగల్ మండలం నుంచి 11 మంది, మాడ్గుల మండలం నుంచి 5 మంది, తలకొండపల్లి మండలం నుంచి 2 మంది, కడ్తాల్ మండలం నుంచి ఒకరు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఐక్యత ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు తన వంతు సహాయ సహకారాలు అందించడమే లక్ష్యంగా సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జాబ్ డ్రైవ్ కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తున్నట్లు తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
అదేవిధంగా నిరుపేద విద్యార్థుల ఉన్నత చదువులకు భరోసా కల్పించడం, ఉచిత కోచింగ్ సెంటర్ల ఏర్పాటు వంటి విద్యా సేవా కార్యక్రమాలను కూడా నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధి శ్రీనివాస్, ఐక్యత ఫౌండేషన్ సభ్యులు జైపాల్ రెడ్డి, చంద్రశేఖర్, ఇంటర్వ్యూకు హాజరైన నిరుద్యోగ యువత పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


