తిమ్మాజిపేట: మండల కేంద్రంలోని ఓ గిరిజన కుటుంబంపై ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో రాళ్లు, కత్తులతో దాడి చేసిన ఘటనను ఖండిస్తూ ఆదివాసీ గిరిజన కాంగ్రెస్ నాయకులు నాగర్కర్నూల్ జిల్లా ఎస్పీకి వినతిపత్రం సమర్పించారు. ఈ ఘటనలో టీఆర్ఎస్ నాయకులతో పాటు కొందరు రౌడీ మూకలు పాల్గొన్నారని వారు ఆరోపించారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, దాడికి పాల్పడిన వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు చేపట్టాలని నాయకులు కోరారు. బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు, నాన్-బెయిలబుల్ కేసులు, హత్యాయత్నం కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా బాధిత గిరిజన కుటుంబానికి పోలీసు రక్షణ కల్పించి, వారికి న్యాయం చేయాలని ఎస్పీని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన కాంగ్రెస్ నాయకులు ప్రేమ్ నాయక్, తిమ్మాజిపేట సేవాలాల్ సంఘం అధ్యక్షులు సత్యం నాయక్, చన్రాయన్పల్లి శంకర్ నాయక్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ వాల్యా నాయక్, వట్టిపల్లి సర్పంచ్ బధ్యా నాయక్, శ్రీనివాస్ నాయక్, భాస్కర్ నాయక్, రాములు నాయక్, ఎస్సీ సెల్ సభ్యులు గుమ్మకొండ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


