నాగర్‌కర్నూల్: జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొత్తపల్లి వినోద్ కుమార్ అధ్యక్షతన జిల్లా యూత్ కాంగ్రెస్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఇన్చార్జి సయ్యద్ ఖాలీద్, నేషనల్ సెక్రటరీ శ్రీనివాస్ రాథోడ్, జిల్లా ఇన్చార్జి జరుపుల లక్ష్మి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సయ్యద్ ఖాలీద్ మాట్లాడుతూ నాగర్‌కర్నూల్ జిల్లాలో యూత్ కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేయాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ఓటర్ల జాబితా, SIR ప్రక్రియపై తమ పార్టీ చేస్తున్న ఆరోపణలు, అభ్యంతరాలను ప్రజలకు వివరించాలని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు చురుగ్గా పనిచేయాలని పిలుపునిచ్చారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలనే డిమాండ్‌పై పోరాటాన్ని కొనసాగించాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులు, తాలూకా అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, వివిధ మండలాల అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


