నాగర్కర్నూల్, తొలి కిరణం బ్యూరో: నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాలలో జిల్లాస్థాయి ఎస్జీఎఫ్ అండర్-14 కోకో, వాలీబాల్ ఎంపిక పోటీలు పకడ్బందీగా నిర్వహించారు. ఎస్జీఎఫ్ సెక్రటరీ ఎస్. నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జిల్లాలోని పీడీలు, పీఈటీలు సమన్వయంతో పోటీలను నిర్వహించారు. అండర్-14 కోకో బాలుర, బాలికల జట్లతో పాటు అండర్-14 వాలీబాల్ బాలుర, బాలికల జట్లను నిష్పక్షపాతంగా ఎంపిక చేశారు. ఎంపిక ప్రక్రియ సజావుగా సాగింది.
ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి రమేష్ క్రీడా పోటీలను సందర్శించి ఎంపిక ప్రక్రియను పరిశీలించారు. పకడ్బందీగా, నిష్పక్షపాతంగా ఎంపిక ప్రక్రియను నిర్వహించిన ఎస్జీఎఫ్ సెక్రటరీ ఎస్. నాగేశ్వరరావుతో పాటు జిల్లాలోని పీడీలు, పీఈటీలను డీఈఓ అభినందించారు. క్రీడాకారులు ప్రతిభను చాటుకుని జిల్లా స్థాయిలో ఎంపికై రాష్ట్రస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరచాలని ఆయన ఆకాంక్షించారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


