తొలి కిరణం ప్రతినిధి, కల్వకుర్తి: మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్న కార్మికుల ఆరోగ్యం, భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని మున్సిపల్ చైర్పర్సన్ బృంగి రత్నమాల ఆనంద్ కుమార్ తెలిపారు. బుధవారం కల్వకుర్తి మున్సిపల్ కార్యాలయంలో కార్మికుల కోసం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత హెల్త్ క్యాంప్‌ను వైస్ చైర్మన్ షానవాజ్ ఖాన్, మున్సిపల్ కమిషనర్ మహమూద్ షేక్‌తో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు సేఫ్టీ జాకెట్లు, గ్లౌజ్‌లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ మున్సిపల్ పారిశుధ్య కార్మికులు ప్రతిరోజూ ప్రజల ఆరోగ్యం, పట్టణ పరిశుభ్రత కోసం కష్టపడి పనిచేస్తున్నారని అన్నారు. విధుల సమయంలో కార్మికులు తప్పనిసరిగా రక్షణ పరికరాలను వినియోగించాలని సూచించారు. కార్మికుల ఆరోగ్య పరిరక్షణ కోసం అవసరమైన వైద్య పరీక్షలు, భద్రతా చర్యలను నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కమిషనర్ మొహమ్మద్ షేక్, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ భీమా, సీహెచ్ఓ శ్రీనివాస్, ఎంఎల్హెచ్ఎస్ వర్షిత్ రెడ్డి, భాగ్యలక్ష్మి, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


