తొలి కిరణం ప్రతినిధి, బిజినపల్లి: బిజినపల్లి మండలంలోని పాలెం స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో సాంఘిక శాస్త్రంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉపాధ్యాయులకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాలెంలో జరిగిన ఈ కార్యక్రమంలో సాంఘిక శాస్త్రంలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన జడ్పీహెచ్ఎస్ లట్టుపల్లికి చెందిన యాదగిరి, యూపీఎస్ అల్లీపూర్‌కు చెందిన ప్రభాకర్, కురుమయ్య, జడ్పీహెచ్ఎస్ వట్టెంకు చెందిన వెంకటరామిరెడ్డి, జడ్పీజీహెచ్ గంగారాంకు చెందిన ఆసిఫ్‌లను స్కూల్ కాంప్లెక్స్ పరిధిలోని ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. విద్యార్థులకు సాంఘిక శాస్త్రంపై అవగాహన కల్పిస్తూ ఉత్తమ బోధన అందిస్తున్న ఉపాధ్యాయులను అభినందిస్తూ ఈ సత్కారం నిర్వహించారు. కార్యక్రమంలో స్కూల్ కాంప్లెక్స్ పరిధిలోని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


